వంద రూపాయలు ఇవ్వలేదని కన్నతండ్రిని కొట్టి చంపిన కొడుకు

  • నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో దారుణం
  • మద్యానికి బానిసై డబ్బుల కోసం తండ్రితో తనయుడి ఘర్షణ
  • అడిగిన డబ్బు ఇవ్వకపోవడంతో కర్రతో తలపై కొట్టి హత్య
వంద రూపాయలు అడిగితే ఇవ్వని తండ్రిని తనయుడు కడతేర్చిన ఘటన నల్లగొండ జిల్లాలో తాజాగా వెలుగు చూసింది. జిల్లాలోని చింతపల్లి మండలం కేంద్రానికి చెందిన మలయ్య(90)కు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. అతడి భార్య సాయమ్మ కొంత కాలం క్రితం మరణించింది. పెద్ద కుమారుడు బుగ్గయ్య తండ్రితోనే ఉంటున్నాడు. కూలి పనులు చేసుకునే అతడి భార్య కొంతకాలం క్రితం భర్తను విడిచి వెళ్లిపోయింది. 

అయితే, మద్యానికి బానిసైన బుగ్గయ్య ఇటీవల తండ్రి అసరా పింఛన్ డబ్బుల కోసం గొడవపడ్డాడు. రూ.100 ఇవ్వాలంటూ శుక్రవారం మరోమారు తండ్రితో గొడవకు దిగాడు. తండ్రి డబ్బులు ఇవ్వకపోవడంతో విచక్షణ కోల్పోయిన బుగ్గయ్య అతడి తలపై కర్రతో కొట్టడంతో బాధితుడు ఘటన స్థలంలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Nalgonda District
Telangana
Crime News

More Telugu News